కరోనా వ్యాక్సిన్
వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత చేయాల్సినవి:
1. వ్యాక్సిన్‌కు ముందు మీ ఫ్యామిలీ డాక్టర్‌తో మాట్లాడి ఒకవేళ మీరు మందులు వేసుకుంటే అలెర్జీ వచ్చే ప్రమాదం ఉంటే, మీ వైద్యుల సలహా మేరకు నడుచుకోండి.
2. వ్యాక్సిన్ వేసుకునే కొద్ది గంటల ముందు తేలికపాటి భోజనం చేయండి. ఎందుకంటే, వ్యాక్సిన్ వేసుకున్నాక కొద్ది సేపు వరకు మీరు ఏమీ తినకపోవడం మంచిది.
3. వ్యాక్సిన్‌కు ముందు కొద్ది సేపు విశ్రాంతి తీసుకోండి.
4. వ్యాక్సిన్ తీసుకోవడానికి వెళ్లే సమయంలో తేలికపాటి, సౌకర్యవంతమైన బట్టలనే ధరించండి. తద్వారా, మీ చేతి భుజానికి వ్యాక్సిన్ షాట్ ఇచ్చేటప్పుడు సక్రమంగా కూర్చోగలరు.
5. మీ నోరు, ముక్కును కప్పి ఉంచగలిగే సరైన మాస్క్‌ను ధరించి వ్యాక్సిన్ కేంద్రానికి వెళ్లండి. వ్యాక్సిన్ కేంద్రంలో ఇతరుల నుండి కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించండి.
వ్యాక్సిన్‌కు ముందు, తర్వాత చేయకూడనివి:
1. వ్యాక్సిన్‌తో మీకు అలర్జీ వచ్చే అవకాశం ఉందని మీ ఫ్యామిలీ డాక్టరు ధృవీకరిస్తే.. ఆ విషయాన్ని వ్యాక్సిన్ వేసే డాక్టర్ వద్ద అస్సలు దాచకండి.
2. వ్యాక్సిన్ వేసే ముందు లేదా వేసిన తర్వాత ఆల్కహాల్ లేదా ఏదైనా మత్తు పదార్థాన్ని తీసుకోవద్దు.
3. టీకా కేంద్రంలో ఉన్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వస్తువులను లేదా ఇతర రోగులను తాకవద్దు. వ్యాక్సిన్ కేంద్రంలో COVID-19- ప్రోటోకాల్‌ను పాటించండి.
4. వ్యాక్సిన్ ద్వారా దుష్ప్రభావాలు ఉంటాయని ఇతరులు ఇచ్చే ఉచిత సలహాలను పట్టించుకోకండి. వ్యాక్సిన్‌కు బదులు ఎసిటమినోఫెన్ లేదా ఇబుప్రోఫెన్ – పెయిన్ కిల్లర్స్ వంటి మెడిసిన్ తీసుకోవచ్చని ఎవరు చెప్పినా నమ్మకండి. ఎందుకంటే, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది.
టీకా తర్వాత వచ్చే దుష్ప్రభావాలు:
టీకా తీసుకున్న తర్వాత ఇంజెక్షన్ ఇచ్చిన భాగంలో నొప్పి, వాపు, జ్వరం, చలి, అలసట, తలనొప్పి వంటి దుష్ప్రభావాలకు లోనవ్వచ్చు. అంత మాత్రాన ఎటువంటి బయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత వచ్చే దుష్ప్రభావాలు- ఒకటి లేదా రెండు రోజుల కన్నా ఎక్కువగా ఉండవు. ఒకవేళ ఉంటే, మీ వైద్యుడితో మాట్లాడిచెప్పిన జాగ్రత్తలను పాటించండి.