Home SACHIVALAYAM జీవో నెంబర్ 2 ప్రకారం సర్పంచ్ కి సచివాలయం మీద అధికారం లేదు.…

జీవో నెంబర్ 2 ప్రకారం సర్పంచ్ కి సచివాలయం మీద అధికారం లేదు.…

166

జీవో నెంబర్ 2 ప్రకారము…

గౌరవ సర్పంచులకు కేవలము పంచాయతీల మీద మాత్రమే అధికారము కలదు.

అందు పనిచేయుచున్న రెగ్యులర్ పంచాయతీ కార్యదర్సులకు మరియు, గ్రేడ్ -5 కార్యదర్సులకు CL మంజూరు చేయు అధికారము మాత్రమే కల్పించి నారు .

కానీ సర్పంచులకు
సచివాలయాల మీద కానీ , అందులో పనిచేయుచున్న సచివాలయ వాలంటీర్ లు మరియు ఉద్యోగుల (గ్రేడ్-6 పంచాయతీ కార్యదర్శి అనగా డిజిటల్ అసిస్టెంట్ నుండి మిగిలిన 10 మంది సచివాలయ ఉద్యోగుల మీద ఎటువంటి అధికారములు కల్పించబడలేదు.

వారికి సెలవు మంజూరు చేయు అధికారము మరియు ఏ ఇతర రకములైన అధికారములు కానీ కల్పించబడలేదు.

సచివాలయ
ఉద్యోగులకు సాలరీ ఇచ్చే అవకాశం
VROలకు కల్పించారు. అన్ని రకముల గవర్నమెంట్ స్కీంలకు బాధ్యత గల అధికారి గా VRO వ్యవహరిస్తారు.

కానీ సచివాలయ ఉద్యోగుల సెలవులను మంజూరు చేయుటకు సంబంధిత మండల శాఖ…

అనగా ఇంజనీరింగ్ సచివాలయ ఉద్యోగులకు
వారి సెలవులను మంజూరు చేయుటకు
ఆ CL ను మండల JE గారికి ,

మహిళా పోలీస్
( GMSKలు ) వారి CLను మండల SHO (SI) గారికి
వెల్ఫేర్ అసిస్టెంట్ లకు, సాంఘీక సంక్షేమ శాఖ అధికారి వారికి,

గ్రేడ్ -5, గ్రేడ్ -6లకు మాత్రము
ఎంపీడీఓలకు

ఇలా 10 మంది సచివాలయ ఉద్యోగుల సెలవులను వారి వారి శాఖల అధికారులకు
ఆ సచివాలయ
VRO గారు మంజూరు కొరకు వారి లాగిన్ ద్వారా ఆన్లైన్ లో పంపించెదరు.

అలాగే ఇంతవరకూ
రెగ్యులర్ పంచాయతీ కార్యదర్సులకు
శాలరీ బిల్, ఎంపీడీఓ అధీనములో ఉండేవి.
ఇప్పుడు వారి సాలరీలకు వారే DDOలు .

సచివాలయ గ్రేడ్ -5 కార్యదర్శి లకు కూడా వారికి వారే శాలరీ DDOలు.

మరియు ఎంపీడీఓ లకు
పంచాయతీ కార్యదర్సుల మీద కూడా ఎటువంటి అధికారములు కల్పించబడలేదు.

****. **
కొత్త జీవో ప్రకారము అధికారములు కోల్పోయినవారు :

MPDO లు అన్ని Schemeల మీద, మరియు
సెక్రటరీల మీద సచివాలయముల మీద
అధికారములు కోల్పోయినారు.

గౌరవ సర్పంచులలకు సచివాలయాల మీద ఎటువంటి అధికారములు లేవు.

సెక్రటరీలకు కూడా సచివాలయముల మీద అధికారము లేదు .
కేవలం సచివాలయముల కు link ఆఫీసర్ మాత్రమే…

అధికారములు కల్పించబడిన వారు…
VRO లు సచివాలయ Staff మరియు వాలంటీరులకు శాలరీ ఇచ్చు అధికారము. అన్ని గవర్నమెంట్ స్కీం ల మంజూరుకు బాధ్యత గల అధికారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here