మ్యారేజీ_సర్టిఫికెట్ లేదా వివాహ ధ్రువీకరణ పత్రం పొందడానికి చేయవలసినవి.

  141

  How to Get Marriage certificate from Gramasachivalayam or Marriage Registration Office

  ●గతంలో మ్యారేజి సర్టిఫికెట్ అవసరం ఉండేది కాదు 30, 40 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
  ●భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం కింద లేదా 1954 వివాహ ప్రత్యేక చట్టం కింద మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
  ●మీరు వివాహం చేసుకున్నారని ధ్రువీకరించే అధికారికమైన సర్టిఫికెట్ అది.
  ●మహిళల రక్షణ కోసం వివాహాన్ని నమోదు చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు 2006లో తప్పనిసరి చేసింది.

  #హిందూ_చట్టం_కింద_వివాహం_నమోదు
  భార్య లేదా భర్త నివాస స్థలం ఏ సబ్ డివిజననల్ మెజిస్ట్రేట్ ప్రాంత పరిధిలోకి వస్తుందో ఆ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (పనిదినాల్లో మాత్రమే కార్యాలయంలో) దరఖాస్తు చేసుకోవాలి

  1.దరఖాస్టుపై భర్త, భార్య ఇద్దరు కూడా సంతకం చేయాలి.

  2. దరఖాస్తు చేసుకున్న రోజున వెరిపికేషన్ కోసం సంబంధిత పత్రాలను అన్నింటినీ తీసుకుని వెళ్లాలి.
  3.అపాయింట్‌మెంట్ కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం సమాచారాన్ని సంబంధిత పార్టీలకు అందిస్తారు.
  4.అపాయింట్‌మెంట్ రోజున ఇరు పార్టీలు కూడా తమ వివాహానికి హాజరైన గజిటెడ్ ఆఫీసరుతో పాటు అడిఎం ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
  అదే రోజు సర్టిఫికెట్ జారీ చేస్తారు.

  #దరకాస్తుకిసం_అవసరమైన_పత్రాలు…

  Required Documents for Marriage certificate

  1.ఓటరు ఐడి/ రేషన్ కార్డు/ పాస్‌పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్/ఆధార్ కార్డులు/పాన్ కార్డులు,
  2.భార్యాభర్తల పుట్టిన తేదీల ప్రూఫ్ SSC/ భర్త్ సర్టిఫికేట్
  3. పాస్‌పోర్టు సైజు ఫోటోలు,
  4. మ్యారేజీ ఫొటోలు
  5.వివాహ ఆహ్వాన పత్రిక
  6.భార్య నుంచి, భర్త నుంచి ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్‌లో విడివిడిగా మ్యారేజ్ అఫిడవిట్స్
  7.అన్ని పత్రాలను కూడా సెల్ప్ అటెస్ట్ చేయాలి
  దరఖాస్తును భర్తీ చేసి భార్యాభర్తలిద్దరు దానిపై సంతకం చేయాలి.

  కొత్తగా వివాహ చేసుకున్నవారు మీ దగ్గరలోఉన్న గ్రామ సచివాలయం ద్వారా నమోదు పెళ్లైన 60 రోజులలో మాత్రమే చేసుకోగలరు. పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిస్టెంట్ ద్వారా నమోదు చేసి సరైన డాకుమెంట్స్ సబ్మిట్ చేసిన యెడల పంచాయతీ కార్యదర్శి వివాహ పత్రాన్ని మంజూరు చేస్తారు

  #ఆన్‌లైన్_రిజిస్ట్రేషన్ sachivalayam ద్వారా చేయవచ్చు
  రిజిస్ట్రేషన్ సైట్లో కి వెళ్ళి మ్యారేజి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మోదట జిల్లాను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి.
  భర్త/భార్య వివరాల పట్టికను నింపాలి.
  అపాయింట్‌మెంట్ తేదీని
  ఎంపిక చేసుకోవాలి.

  “Submit Application” క్లిక్ చేయాలి
  తాత్కాలిక నంబర్ కేటాయిస్తారు.

  acknowledgement slip మీద అది ప్రింటై కనిపిస్తుంది. దరఖాస్తు ఫారం పూర్తయినట్లు లెక్క.🖱

  acknowledgement slip ప్రింటవుట్ తీసుకోవాలి.

  అపాయింట్‌మెంట్
  హిందూ వివాహం చట్టం కింద అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లో అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వివాహ ప్రత్యేక చట్టం ( ఇతర మతాల వారికి) కింద
  అయితే 60 రోజుల దాకా పట్టవచ్చు.

  3 గురు సాక్షులు
  వివాహానికి హాజరైన ఎవరైనా సాక్షులుగా ఉండవచ్చు. అయితే, ఆ సాక్షికి పాన్ కార్డు, రెసిడెన్స్ ప్రూఫ్ ఉండాలి.🗞

  30, 40 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్న జంటలు ఇప్పుడు పెళ్లికి సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడితే ఎలా దరఖాస్తు చేసుకోవాలనే విషయం తెలియక ఇబ్బందులు పడుతున్నారు.

  భారతదేశంలో 1955 హిందూ వివాహ చట్టం కింద లేదా 1954 వివాహ ప్రత్యేక చట్టం కింద మ్యారేజీ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 🖱

  మీరు వివాహం చేసుకున్నారని ధ్రువీకరించే అధికారికమైన సర్టిఫికెట్ అది.

  మహిళల రక్షణ కోసం వివాహాన్ని నమోదు చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు 2006లో తప్పనిసరి చేసింది.

  హిందూ చట్టం కింద వివాహం నమోదు: 🖱
  భార్య లేదా భర్త నివాస స్థలం ఏ సబ్ డివిజననల్ మెజిస్ట్రేట్ ప్రాంత పరిధిలోకి వస్తుందనే విషయాన్ని తెలుసుకుని పనిదినాల్లో ఆ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

  దరఖాస్టుపై భర్త, భార్య ఇద్దరు కూడా సంతకం చేయాలి.

  దరఖాస్తు చేసుకున్న రోజున వెరిపికేషన్ కోసం సంబంధిత పత్రాలను అన్నింటినీ తీసుకుని వెళ్లాలి. 🖱

  అపాయింట్‌మెంట్ కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. రిజిస్ట్రేషన్ కోసం సమాచారాన్ని సంబంధిత పార్టీలకు అందిస్తారు.

  అపాయింట్‌మెంట్ రోజున ఇరు పార్టీలు కూడా తమ వివాహానికి హాజరైన గజిటెడ్ ఆఫీసరుతో పాటు అడిఎం ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
  అదే రోజు సర్టిఫికెట్ జారీ చేస్తారు.

  అవసరమైన పత్రాలు…

  దరఖాస్తును భర్తీ చేసి భార్యాభర్తలిద్దరు దానిపై సంతకం చేయాలి🖱

  ఓటరు ఐడి/ రేషన్ కార్డు/ పాస్‌పోర్టు/ డ్రైవింగ్ లైసెన్స్

  ఆధార్ కార్డులు, పాన్ కార్డులు,

  భార్యాభర్తల పుట్టిన తేదీల ప్రూఫ్
  SSC/ భర్త్ సర్టిఫికేట్

  2 పాస్‌పోర్టు సైజు ఫోటోలు,
  2 మ్యారేజీ ఫొటోలు

  వివాహ ఆహ్వాన పత్రిక

  భార్య నుంచి, భర్త నుంచి ప్రిస్క్రైబ్ చేసిన ఫార్మాట్‌లో విడివిడిగా మ్యారేజ్ అఫిడవిట్స్

  అన్ని పత్రాలను కూడా సెల్ప్ అటెస్ట్ చేయాలి🖱

  ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్

  మీ సేవ ద్వారా చేయవచ్చు

  రిజిస్ట్రేషన్ సైట్లో కి వెళ్ళి
  మ్యారేజి రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మోదట జిల్లాను ఎంపిక చేసుకుని ముందుకు సాగాలి.
  భర్త/భార్య వివరాల పట్టికను నింపాలి.
  అపాయింట్‌మెంట్ తేదీని
  ఎంపిక చేసుకోవాలి.
  “Submit Application” క్లిక్ చేయాలి
  తాత్కాలిక నంబర్ కేటాయిస్తారు.

  acknowledgement slip మీద అది ప్రింటై కనిపిస్తుంది. దరఖాస్తు ఫారం పూర్తయినట్లు లెక్క.🖱

  acknowledgement slip ప్రింటవుట్ తీసుకోవాలి.

  అపాయింట్‌మెంట్
  హిందూ వివాహం చట్టం కింద అయితే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న తర్వాత 15 రోజుల్లో అపాయింట్‌మెంట్ లభిస్తుంది. వివాహ ప్రత్యేక చట్టం ( ఇతర మతాల వారికి) కింద
  అయితే 60 రోజుల దాకా పట్టవచ్చు.

  3 గురు సాక్షులు
  వివాహానికి హాజరైన ఎవరైనా సాక్షులుగా ఉండవచ్చు. అయితే, ఆ సాక్షికి ఆధార్ కార్డులు తప్పని సరిగా ఉండాలి

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here