ప్రభుత్వ ఉద్యోగం లో తరచూ వినే మాట సస్పెన్షన్.. సస్పెండ్ అయిన ఉద్యోగికి జీవన భృతి నిమిత్తం ఎటువంటి ఆర్ధిక ప్రయోజనాలు వర్తిస్తాయో మరియు వాటిపై సందేహాలకు సమాధానాలు పిడిఎఫ్ లో విపులంగా వివరించడమైనది.
1) సస్పెన్షన్ కాలాన్ని సాధారణ సెలవు గా ప్రకటించ కూడదు
2) సస్పెండ్ అయి ఉత్పన్నమైన ఖాళీ పోస్టు ని పదోన్నతి తో నింపరాదు
3) సస్పెండ్ అయిన ఉద్యోగి చెల్లిస్తున్న జీవనాధార భత్యం నుండి బకాయిలకు adjust చేయరాదు
4) సస్పెండ్ అయిన ఉద్యోగికి సస్పెండ్ అయిన రోజు ఎంత HRA పొందుచున్నాడో అంత HRA ఆరు నెలల వరకూ చెల్లించాలి.ఆరు నెలలు దాటిన తరువాత దామాషా పద్దతి పై HRA చెల్లించాలి
5) కేసు ఎదుర్కొంటున్న వ్యక్తి కి తుది తీర్పు వచ్ఛే వరకూ జీవనాధార భత్యం చెల్లించాలి
6) జీవనాధార భత్యం నుండి కోర్టు ఎటాచ్ మెంట్ లు మినహాయింపు చేయరాదు
7) GOMS NUMBER 578/13-12-1999 ప్రకారం ప్రతీ ఆరు నెలలకి ఒకసారి సస్పెన్షన్ ల పై పునః పరిశీలన చెయ్యాలి.
8) GOMS NUMBER:257/10-6-1999 తీవ్రతరం కానీ ఆరోపణలు ఉన్న ఉద్యోగికి పదోన్నతి కల్పించవచ్చూను
9) GOMS NUMBER 275/ 8-8-77 ప్రకారం సస్పెన్షన్ కాలంలో మరణిస్తే సదరు కాలాన్ని డ్యూటీ క్రింద పరిగణించాలి
10) GOMS NUMBER 526/19-8-2008 ప్రకారం సస్పెండ్ అయి రెండు సంవత్సరాలు దాటిన ఉద్యోగికి వెంటనే సర్వీస్ పునరుద్ధరణ చెయ్యాలి.
11) సస్పెన్షన్ వెనుకటి తేదీ నుండి చేయరాదు
సస్పెండ్ అయిన ఉద్యోగికి జీవన భృతి నిమిత్తం ఎటువంటి ఆర్ధిక ప్రయోజనాలు వర్తిస్తాయో మరియు వాటిపై సందేహాలకు సమాధానాలు
Read Time:2 Minute, 29 Second