Read Time:2 Minute, 22 Second
F.I.R *(ఎఫ్.ఐ.ఆర్) అంటే ఏమిటి?. సెక్షన్ 154 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973
F.I.R అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటారు. ఈ నివేదిక చాలా ముఖ్యమైనది .కేసుకు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలు ఇందులో ఉంటాయి. ఫిర్యాదు చేసింది ఎవరు? ఆ నివేదిక తయారు చేసింది ఎవరు? ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఆ నేరాన్ని ఎవరు చూశారు? ఎన్ని గంటలకు జరిగింది, ఏం జరిగింది అన్ని వివరాలు ఎఫ్.ఐ.ఆర్ లో ఉంటాయి .నేరం జరగగానే నేరం తాలూకా వివరాలన్నీ పోలీస్ స్టేషన్లో తెలియజేయాలి. అప్పుడు పోలీసు వారు రిపోర్ట్ ను ఎవరు ఇచ్చింది ? ఏ విషయంలో ఇచ్చింది ?ఏ సమయంలో జరిగింది రాసుకుని దానిని వేరే నివేదిక తయారు చేసి, మెజిస్ట్రేట్ కు అందజేస్తారు. దీనిని ఎఫ్.ఐ.ఆర్ అని అంటారు. దానిపై మెజిస్ట్రేట్ సంతకం చేస్తారు.. నేరం జరిగిన సమయము, స్థలము అన్ని రాసి ఉంటాయి. పేర్లు రాసి ఉంటాయి .ఫిర్యాదు ఒకసారి పోలీస్ స్టేషన్లో కానీ మెజిస్ట్రేట్ వద్దు కాని దాఖలు చేస్తే దానిని మార్చడానికి వీలుపడదు. రాసిన వివరాలు మార్చడానికి గాని కొత్త వివరాలు రాయడం గాని జరగదు. మీ పేరు ఎఫ్.ఐ.ఆర్ లో లేకపోతే మీకు బెయిలు వెంటనే మంజూరు అవుతుంది. లేకపోతే ఆ కేసులో మీ పేరుని తేసేయవచ్చు. నేరానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు, జరిగిన సంఘటన, పేర్లు ఉంటాయి.. రిపోర్ట్ ను మనమైనా రాసి ఇవ్వవచ్చు. లేదా స్టేషన్లో HC అంటే హెడ్ కానిస్టేబుల్ లేదా రైటర్ ఉంటారు వాళ్ళు అయినా మనం జరిగిన తగువు గురించి చెబితే వారు రిపోర్ట్ వ్రాసుకొని FIR తయారు చేస్తారు.