Home SACHIVALAYAM Leave Rules – సెలవులు వివరణ

Leave Rules – సెలవులు వివరణ

169

ఇప్పటికి సెలవులు ఎలా దరఖాస్తు చేసుకొని ఆమోదించుకోవాలి..ఏ విధంగా సదరు కాలాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలి అనే సందేహాలు మనలో చాలామందికి ఉన్నాయి.. పిడిఎఫ్ లో మనకున్న సందేహాలు పై విపులంగా వివరించారు.. చదవండి
1) కవల పిల్లలు /ఇద్దరు పిల్లలు తరువాత అబార్షన్ చేయించుకుంటే 21 రోజుల స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తించదు
2) ఫండమెంటల్ రూల్ 72 ప్రకారం సెలవులో ఉన్న ఉద్యోగి సదరు సెలవు పూర్తి కాకుండా డ్యూటీ లో జాయిన్ అవ్వడానికి ముందస్తు అనుమతి పొందాలి
3) ఫండమెంటల్ రూల్68(5) ప్రకారం లోకల్ హాలిడే కి prefix గాని suffix గాని చేసుకునే అవకాశం లేదు
4) ఫండమెంటల్ రూల్65(బి) ప్రకారం డిస్మిస్ అయిన ఉద్యోగి మరలా నియమించబడితే పూర్వపు సర్వీస్ ని పరిగణలోకి తీసుకోవాలి
5) ఫండమెంటల్ రూల్ 68(3) ప్రకారం E L కి prefix గాని suffix చేసుకున్నప్పుడు లీవ్ అకౌంట్ నుండి ఆ రోజులు డెబిట్ చేయరాదు
6) ఫండమెంటల్ రూల్ 101(2) ప్రసూతి సెలవు అనంతరం మెడికల్ సర్టిఫికెట్ జత చేస్తూ ఏ ఇతర సెలవైన తీసుకోవచ్చూను
7)ప్రమాదానికి గురైన ఉద్యోగి గాని,తీవ్ర అనారోగ్యానికి గురి అయిన ఉద్యోగి గాని సెలవుకాలం అయిపోయిక కూడా మెడికల్ సర్టిఫికేట్ మరియు ఫిట్నెస్ సర్టిఫికెట్ జత చేసి సెలవు మంజూరు చేసుకోవచ్చూను.
8) గుండె జబ్బులు మరియు క్యాన్సర్ ఉద్యోగులు కు హాఫ్ పే లీవ్ ఉంటే 6 నెలలు వరకూ పూర్తి జీతం పొందవచ్చూను..
9) GOMS NO133 ప్రకారం ఉద్యోగి కార్యాలయం పని నిమిత్తం ప్రయాణం చేస్తూ ప్రమాదానికి గురి అయితే మాత్రమే స్పెషల్ disability లీవ్ కి అర్హులు
10) సాధారణ సెలవులు prefix suffix కలుపుకొని పది రోజులకి మించరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here