0 0
Read Time:3 Minute, 0 Second

హిందూ వివాహ చట్టం 1955 ప్రకారము వివాహం జరిగిన తరువాత వివాహం రద్దుచేసి విడాకులు కావాలని భార్య గానీ, భర్త గానీ అడగవచ్చు. ఈ క్రింది చెప్పబడిన ఏ ఒక కారణం వలనయినా విడాకులు కోరవచ్చు హిందూ మ్యారేజ్ ఆక్ట్ సెక్షన్ 13(1)(ia)

  1. వివాహం తరువాత ఇతర స్త్రీతో భర్త గాని , ఇతర పురుషునితో భార్యగాని వ్యభిచరించినపుడు
  2. వివాహం తర్వాత భర్త బార్యకుగాని, భార్య భర్తకు గానీ హింసకు గురి చేసినప్పుడు శారీరికంగా, మానసికంగా గాని కావచ్చు.
  3. విడాకుల పిటిషన్ కోర్టులో దాఖలు చేయుటకు ముందు భర్త భార్యను గానీ, భార్య భర్తను అకారణముగా రెండు సంవత్సరాల పైగా వదిలివేసిన లేక నిరాదరణ చేసినప్పుడు
  4. భార్య,భర్త గానీ హిందూమతము వదిలి మరియొక మతములో స్వీకరించినప్పుడు
  5. నయం కానటువంటి కుష్టి వ్యాధి తో ప్రతివాది బాధపడుతున్నప్పుడు
  6. అంటువ్యాధుల వలన గాని, సుఖ రోగముల వలన గాని ప్రతివాది బాధపడుతున్నప్పుడు
  7. సంసారమును విడిచి భార్య, భర్త సన్యాసిగా మారినప్పుడు
  8. ఏడు సంవత్సరాల పాటు భార్య, భర్త ఆచూకీ లేనప్పుడు, తిరిగిరానప్పుడు

ఇరువురి సమ్మతితో విడాకులు సెక్షన్ 13 (B), (mutuval divorce)
ఈ క్రింద చెప్పబడిన భార్య భర్తల ఇద్దరి సమ్మతితో విడాకులు కోరవచ్చు

  1. పిటిషన్ పెట్టె రోజుకు ముందు సంవత్సరం పైగా ఇద్దరు విడి విడిగా ఉన్నట్లయితే
  2. భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించడం సాధ్యం కానప్పుడు

సాధారణంగా పెండ్లి జరిగిన ఒక సంవత్సరం లోపు విడాకుల పిటిషన్ వేయరాదు అయితే అసాధారణ పరిస్థితులు మాత్రం పెండ్లి జరిగిన సంవత్సరం లోపు గాని కోర్టు అనుమతితో విడాకుల పిటిషన్ వేయవచ్చును. కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన 6 నెలలు లోపల విడాకులు పొందవచ్చు.

సెక్షన్ 9 దాంపత్య హక్కుల పునరుద్ధరణ ( కాపురానికి రమ్మని పిటిషన్ వేయుట)
భార్యగాని భర్తగాని తగినంత కారణం లేకుండా, కాపురం మాని వేరేగా నివసిస్తుంటే ఆ రెండవ వారు మొదటి వారు తనతో దాంపత్య జీవితం గడపడానికి ఆదేశించమని కోర్టులో పిటిషన్ వేయవచ్చు

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %