0 0
Read Time:12 Minute, 10 Second

Revenue_Records
1) RSR (రీ సెటిల్మెంట్ రిజిష్టర్)
2) 1Bరికార్డు
3) ROR రికార్డ్ ఆఫ్ రైట్
4) డైగ్లాట్
5) ఆక్రమిత భూమి రిజిష్టర్ (అడ్వర్స్ పొసెషన్)
6) అజమాయిషీ
7) ఆవాదీ/గ్రామ కంఠం
8) అగ్రహారం
9) ఫసలీ
10) ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ FMB
11) జమాబందీ.
12) అడంగల్_పహాని
వివరంగా మీ కోసం
1) రీ_సెటిల్మెంట్ రిజిష్టర్ RSR:-
ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణకు ఇదే ఆధారం.
ఆర్ఎస్ఆర్ రిజిష్టర్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్ భూములు, వాగులు, వంకలు లాంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యలయంలో ఉంటాయి.
2) 1Bరికార్డు :-
దీనిప్రకారం ఒక రైతుకు రెవెన్యూ విలేజ్లో ఏఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో తెలుస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఖాతా నంబరు, అనుభవదారుడు వివరాలు కూడా వుంటాయి. గతంలో దీనిని 10 (1) అడంగల్ అని పిలిచేవారు.
3) రికార్డ్_ఆఫ్_రైట్ ROR:-
భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్వోఆర్)ను ప్రామాణికము. దీనిలో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్ బోర్డు భూముల వివరాలుంటాయి.
4) డైగ్లాట్:-
గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలాధారం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు.
అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు వుంటాయి.
5)ఆక్రమిత_భూమి_రిజిష్టర్ (అడ్వర్స్ పొసెషన్):-
భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో (వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకునే దానిని అడ్వర్స్ పొసెషన్ అంటారు. పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉంటే సివిల్ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.
6) అజమాిషీ:-
గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు.
వీఆర్ఓ, మండల ఆర్ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేయాలి.
అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది.
7)ఆవాదీ/గ్రామ కంఠం:-
గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అని గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంమని పిలుస్తారు.
8) అగ్రహారం:-
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు
9) ఫసలీ :-
ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీనిలో వివరాలుంటాయి.
ఇందులో అడంగల్లో నమోదైన వివరాలు ఉంటాయి.
ఏ ఏటికాఏడు భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరిపినపుడు, ప్రస్తుత రైతు పేరును కొట్టివేసి కొత్త రైతు పేరును చేరుస్తారు.
భూమి కొనుగోలుదారులు కొనుగోలు పత్రాలను తీసుకొని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్లో వివరాలు నమోదు చేసుకోవాలి.
10)ఫీల్డ్ మెజర్మెంట్ బుక్_FMB:-
దీనిలో అన్ని సర్వే నంబర్ల పటాలు వాటి నిర్ధిష్ట కొలతలతో సహా ఉంటాయి.
11)జమాబందీ:-
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే పరిశీలన. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఇదే వేదిక. ఏడాదికి ఒకారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు.
12) అడంగల్_పహాని:-
ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టరు. తెలంగాణలో పహాని అని అంటారు. అడంగల్లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వున్నట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే ఇదే ప్రామాణికం.
********************
ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.
మీ
శ్రీనివాస్.బెహరాతప్పక_తెలుసుకోవాల్సిన_రెవెన్యూ_రికార్డులు
Revenue_Records
1) RSR (రీ సెటిల్మెంట్ రిజిష్టర్)
2) 1Bరికార్డు
3) ROR రికార్డ్ ఆఫ్ రైట్
4) డైగ్లాట్
5) ఆక్రమిత భూమి రిజిష్టర్ (అడ్వర్స్ పొసెషన్)
6) అజమాయిషీ
7) ఆవాదీ/గ్రామ కంఠం
8) అగ్రహారం
9) ఫసలీ
10) ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ FMB
11) జమాబందీ.
12) అడంగల్_పహాని
వివరంగా మీ కోసం
1) రీ_సెటిల్మెంట్ రిజిష్టర్ RSR:-
ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం భూమి సేకరణకు ఇదే ఆధారం.
ఆర్ఎస్ఆర్ రిజిష్టర్లో ప్రభుత్వ భూమి, ప్రైవేట్ భూమి(వ్యక్తులు), ఈనాం భూములు, దేవదాయ, వక్ఫ్ భూములు, వాగులు, వంకలు లాంటి వివరాలు ఉంటాయి. ఈ సమాచారం వీఆర్ఓ, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలతోపాటు జిల్లా స్థాయిలో ఏడీ కార్యాలయంలో ఉంటాయి.
2) 1Bరికార్డు :-
దీనిప్రకారం ఒక రైతుకు రెవెన్యూ విలేజ్లో ఏఏ సర్వే నంబర్లో ఎంత విస్తీర్ణం భూములు ఉన్నాయో తెలుస్తుంది. పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న ఖాతా నంబరు, అనుభవదారుడు వివరాలు కూడా వుంటాయి. గతంలో దీనిని 10 (1) అడంగల్ అని పిలిచేవారు.
3) రికార్డ్_ఆఫ్_రైట్ ROR:-
భూమి యాజమాన్య హక్కుపై వివాదం తలెత్తినప్పుడు రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్వోఆర్)ను ప్రామాణికు. దీనిలో ప్రభుత్వ భూములు, బంజరు భూములు, వక్ఫ్ బోర్డు భూముల వివరాలుంటాయి.
4) డైగ్లాట్:-
గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటికీ మూలాధారం ఇది. ప్రతి గ్రామంలో సర్వే సెటిల్మెంటు భూమి వివరాలు నమోదు చేస్తారు.
అన్ని రకాల భూములు, వాటి సర్వే నంబర్లు, విస్తీర్ణం, వాటి వర్గీకరణ, శిస్తు వివరాలు వుంటాయి.
5)ఆక్రమిత_భూమి_రిజిష్టర్ (అడ్వర్స్ పొసెషన్):-
భూమిపై హక్కు ఉన్న వ్యక్తి అనుమతి పొందకుండా ఆ భూమిని స్వాధీనంలో (వాస్తవంగా, శాంతియుతంగా, బహిరంగంగా) ఉంచుకునే దానిని అడ్వర్స్ పొసెషన్ అంటారు. పట్టా భూమి 12 సంవత్సరాలు, ప్రైవేట్ భూమి 30 సంవత్సరాలు స్వాధీనంలో ఉంటే సివిల్ కోర్టు ద్వారా యాజమాన్య హక్కులు పొందవచ్చు.
6) అజమాయిషీ:-
గ్రామ రెవెన్యూ అధికారి నిర్వహించే లెక్కలను తనిఖీ చేయడాన్ని అజమాయిషీ అంటారు.
వీఆర్ఓ, మండల ఆర్ఐ పొందుపరిచిన లెక్కల్లో వివరాలను కొన్నింటినైనా డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్ తనిఖీ చేయాలి.
అలా తనిఖీ చేసిన వివరాలను గ్రామ లెక్క నం.3లో నమోదు చేస్తారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ప్రక్రియ ఇది.
7)ఆవాదీ/గ్రామ కంఠం:-
గ్రామంలో ప్రజలు నివసించే భూమిని ఆవాది అని గ్రామ ఉమ్మడి స్థలాన్ని గ్రామ కంఠంమని పిలుస్తారు.
8) అగ్రహారం:-
బ్రాహ్మణులకు శిస్తు లేకుండా లేదా రాయితీ శిస్తుతో గ్రాంటుగా వచ్చిన గ్రామం లేదా గ్రామంలోని కొంత భాగాన్ని అగ్రహారం అంటారు
9) ఫసలీ :-
ఏటా జూలై 1 నుంచి మరుసటి ఏడాది జూన్ 30వ తేదీ వరకు మొత్తం 12 నెలల పంట కాలాన్ని బట్టి దీనిలో వివరాలుంటాయి.
ఇందులో అడంగల్లో నమోదైన వివరాలు ఉంటాయి.
ఏ ఏటికాఏడు భూములు అమ్మకాలు కొనుగోళ్లు జరిపినపుడు, ప్రస్తుత రైతు పేరును కొటటివేసి కొత్త రైతు పేరును చేరుస్తారు.
భూమి కొనుగోలుదారులు కొనుగోలు పత్రాలను తీసుకొని రెవెన్యూ అధికారులను సంప్రదించి అడంగల్లో వివరాలు నమోదు చేసుకోవాలి.
10)ఫీల్డ్ మెజర్మెంట్ బుక్_FMB:-
దీనిలో అన్ని సర్వే నంబర్ల పటాలు వాటి నిర్ధిష్ట కొలతలతో సహా ఉంటాయి.
11)జమాబందీ:-
జమాబందీ అంటే ప్రభుత్వానికి రావాల్సిన భూమి పన్ను, నీటి పన్ను ఇతర బకాయిలు సక్రమంగా లెక్క కట్టడం. మండల స్థాయి అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే పరిశీలన. రైతులు తమ సాధకబాధకాలను రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి కూడా ఇదే వేదిక. ఏడాదికి ఒకసారి కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ఇతర డిప్యూటీ కలెక్టర్లు పరిశీలిస్తారు.
12) అడంగల్_పహాని:-
ప్రతి ఏటా సాగు భూముల వివరాలు నమోదు చేసే రిజిష్టరు. తెలంగాణలో పహాని అని అంటారు. అడంగల్లో రైతుల పేర్లు నమోదై ఉంటే ఆ భూమిపై పూర్తి హక్కు వున్నట్లే. భూముల క్రయ విక్రయాలు చేయాలంటే ఇదే ప్రామాణికం.
********************
ఇందులో పోస్ట్ చేయబడిన సమాచారం మీ అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %