

అమ్మ ఒడి నగదు బదులు లాప్టాప్స్ ఇవ్వాలని తల్లిదండ్రులు కోరుకుంటే.. వారి పిల్లలకు ల్యాప్ టాప్స్ ఇస్తారు. ఈ పథకం ద్వారా ఇచ్చే ల్యాప్టాప్స్ డ్యూయెల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 ఇంచుల స్క్రీన్, విండోస్ 10, మైక్రోసాఫ్ట్ ఓపెన్ ఆఫీస్ వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి.వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 -12 తరగతుల విద్యార్థులకు అమ్మ ఒడి డబ్బులకు బదులు ఉచితంగా ల్యాప్ ట్యాప్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వారు కోరుకుంటేనే ల్యాప్ టాప్ ఇస్తారు. లేదంటే అమ్మ ఒడి డబ్బులనే అందజేస్తారు. దీనిపై తల్లిదండ్రుల అభీష్టం తెలుసుకునేందుకు వారందరికీ స్వయంగా లేఖ రాశారు సీఎం జగన్. ఈ లేఖలను వారికి చేరేసి, అభీష్టం తెలుసుకొని.. తిరిగి ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.