YSR PEDALANDARIKI ILLU

  281

  ◼️ ఇంటి స్థలాల మంజూరు అర్హత ప్రమాణాలు

  ▪️ లబ్ధిదారుడు ఆంధ్రప్రదేశ్ లో నివాసం ఉంటూ తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉండాలి.

  ▪️ లబ్ధిదారు కుటుంబంలోని మహిళ అయి ఉండవలెను.

  ▪️మీరు ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగి కానీ అయి ఉండకూడదు

  ▪️ మీరు ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అవ్వ రాదు. మీకు స్వతహాగా గాని లేదా మీ వంశపారపర్యంగా గాని ఇల్లు ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అర్హులు కారు!

  ▪️ 3 ఎకరాలు మాగాణి లేదా 10 ఎకరాలు ఆపై మెట్ట లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి ఉండరాదు.

  ▪️ లబ్ధిదారుడు ఇంతకు పూర్వం ఏ ప్రభుత్వం ద్వారా ను ఇల్లు మంజూరు అయి ఉండరాదు.

  ▪️ లబ్ధిదారుడు గత ప్రభుత్వం ద్వారా ఇళ్ళ స్థలం కూడా మంజూరు అయి ఉండరాదు.

  ▪️ ఒకవేళ ఆ కుటుంబంలో మహిళా ఎవరూ కూడా లేకపోతే ఆ కుటుంబంలో పురుషుని పేరు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది

  ◼️ పేదలందరికి ఇల్లు స్కీమ్ క్రింద మీరు కూడా అర్హత ఉంటే ఎక్కడ అప్లై చేసుకోవాలి?:

  ▪️ మీరు తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఇల్లు లేని వారు అయి ఉండి పైన చెప్పిన ప్రమాణాలు చెల్లుబాటు అయినచో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. నూతన విధానం ప్రకారం ఇప్పుడు మీరు అప్లికేషన్ ని మీ సచివాలయం ద్వారా పొంది దానిని నింపి మీ గ్రామ వార్డు వాలంటీర్ కి అందజేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన 90 రోజులలో అర్హులైన వారికి ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుంది.మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు మీయొక్క రేషన్ కార్డు నకలు మీ ఆధార్ కార్డు కాపీ తో పాటు మీకు ఏవైనా భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటే వాటి కాపీ కూడా జత చేయాల్సి ఉంటుంది.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here